టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదు

-

టీఆర్‌ఎస్‌ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదు అయింది. 2020 లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఆ సమయంలో తన ప్రాణహాని ఉంది.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి అందించాడు బాధితుడు.

Rasamayi balakishan sensational comments on Telangana

అయితే.. దాదాపు రెండేళ్ల తర్వాత స్పందించిన పోలీసులు… మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 290, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రసమయిపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీఆర్‌ఎస్‌ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్.. ఈటల రాజేందర్‌ కు టచ్‌ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆయనతో పాటు పలుగురు నాయకులకు కూడా ఈటల ఫోన్‌ చేశారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version