19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసులు

-

బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తూ ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి వణుకు పుట్టిస్తున్నారు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. మరికొంత మంది సినీ తారలకు నోటీసులు ఇచ్చారు. ఇక తాజాగా బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు.

తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చి ఈ యాప్స్ యజమానులను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫన్88 బెట్టింగ్ యాప్ కోసం ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న అధికారులు బెట్టింగ్ యాప్స్ ఓనర్లను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version