తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఉగాది రోజున సాయంత్రం 6 గంటలకు హుజూర్నగర్ లో… సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇక ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ కార్డు షాపులలో సన్న బియ్యం పంపిణీ చేస్తారన్నమాట. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ఆపేసి… ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నారన్నమాట. అయితే ఇలాంటి ప్రకటనలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. మరి ఈసారైనా ఉగాది కానుకగా సన్నబియ్యం ఇస్తారా అనేది చూడాలి.