ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్!

-

ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ అయింది అంటున్నారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ముగ్గురుని సస్పెండ్ చేశారు డీఈవో. అయితే సస్పెండ్ చేసిన డీఈవోకు బెదిరింపులు వస్తున్నాయి. పదోతరగతి విద్యార్థులకు గణితం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలో వాట్స్‌యాప్లో దర్శనమిచింది ప్రశ్నపత్రం.

Class 10th question paper leaked in joint Kadapa district

ఓ వ్యక్తి నేరుగా డీఈవో షంషుద్దీన్ కు సమాచారం చేరవేయడంతో ఆయన ఆ ప్రశ్నపత్రంలోని క్యూఆర్ కోడ్ ఆధారంగా వల్లూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా గుర్తించారు. వల్లూరు మండలంలో ఒకటి, వేంపల్లె మండలంలో రెండు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అండతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం అందుతోంది. ఇక ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ముగ్గురుని సస్పెండ్ చేశారు డీఈవో. అయితే సస్పెండ్ చేసిన డీఈవోకు బెదిరింపులు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version