రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ముగ్గురు నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, ఓ సర్వేయర్‌

-

నీటి పారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లతో పాటు సర్వేయర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్స్ కార్తీక్, నికేశ్ కుమార్‌, సర్వేయర్ గణేశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నెక్నాంపూర్‌లో ఓ భవన నిర్మాణానికి సంబంధించిన ఎన్వోసీ అనుమతి కోసం వారంతా కలిసి లంచం డిమాండ్ చేశారు. మొత్తం రెండున్నర లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ముందుగా లక్షన్నర ఇవ్వాలంటూ బాధితునికి వారు చెప్పారు.

మరో 40 వేల రూపాయలు ఇవ్వాలని గణేశ్ డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీబీ సోదాలు జరిపింది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ భన్సీ లాల్ నుంచి 65 వేల రూపాయలు, నికేశ్ కుమార్ నుంచి 35 వేల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news