కేసీఆర్ కు అవతరణ దినోత్సవ ఆహ్వానం.. నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రం జూన్ 02, 2014న ఆవిర్భవించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరోసారి దీనిని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో పాడించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అందించి సన్మానించనున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ చార్జీ   వేణుగోపాల్ రావుకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్.కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగోపాల్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం నిన్నటి నుంచి వేచి చూస్తున్నారు హర్కర వేణుగోపాల్.కేసీఆర్ ఫామ్ హౌజ్ లో కలిసే ప్రయత్నాలు చేశారు హర్కర. ఫామ్ హౌజ్ కు వద్దు.. హైదరాబాద్ లో కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పిస్తామన్నారు కేసీఆర్ ఆఫీస్ వర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news