కేంద్రం తగ్గించింది..రాష్ట్రం సంగతేంటి?: కిషన్ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ పై టాక్స్ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు రండి కెసిఆర్ అంటూ విమర్శించారు.” తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలి. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజల పై కనికరం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

గత ఆరు నెలల్లో కేంద్రం రెండుసార్లు డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గించింది. రాష్ట్రం కూడా తగ్గిస్తే ప్రజలకు ఊరట కలుగుతుంది.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పైన ప్రశంసలు గుప్పించారు.” ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.7 చొప్పున వ్యాట్ తగ్గించింది. ఈ నిర్ణయం సాహసోపేతమైనది. దీనివలన కేంద్ర ప్రభుత్వానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. అయినా కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మోడీ గత ఆరు నెలల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడం ఇది రెండవ సారి.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news