సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్రం కీలక ప్రకటన..!

-

తెలంగాణ కల్ఫతరువు అయినటువంటి సింగరేణి బొగ్గు గనిని ప్రైవేటీకరణ చేయడం పట్ల తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని.. లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసింది కేంద్రం. తాజాగా లోక్ సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ పై క్లారిటీ ఇవ్వాలని కోరారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ.

ఎంపీ వంశీ ప్రశ్నకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. కేవలం సింగరేణి బొగ్గు గని మాత్రమే కాదు.. దేశంలోని ఏ బొగ్గు గనిని కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని.. స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలంటే 51 శాతం వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయమే చాలా కీలకమని తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని వెల్లడించారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజా ప్రకటనతో సింగరేణి ప్రైవేటీకరణ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news