తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

-

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేసింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడం తో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎట్టివేసినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే. తెలంగాణ లో నవంబర్ 3వ తేదీన ఎన్నికల ప్రకటన జారీ కాగా. 10వ తేదీన వరకు నామ పత్రాలు స్వీకరించారు. 13వ తేదీన నామ పత్రాల పరిశీలన 15వ తేదీన ఉపసంహరణ ఆ తర్వాత నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక డిసెంబర్ 3వ తేదీన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో తాజాగా ఎన్నికల కోడును ఎట్టివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. E ఎత్తివేత తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news