రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

-

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం గెజిట్ ను అందజేసింది.

- Advertisement -

మరోవైపు గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్ కు ఇచ్చారు.  ఈ క్రమంలోనే రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయింది. మరోవైపు మంత్రివర్గ సిఫార్సు మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ రెండో శాసనసభను రద్దు చేశారు. ఇక రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి, మంత్రివర్గంలో ఉండే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇవాళో రేపో ఈ ఎంపిక ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...