నేడు రాష్ట్రానికి రానున్న ఈసీ బృందం

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఇక మరో రెండ్రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఈసీ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ బృందం సమీక్షించనుంది. అనంతరం సీఈవో వికాస్ రాజ్​, ఇతర అధికారులతో భేటీ కానుంది. ఈ భేటీలో సీనియర్ డిప్యూటీ కమిషనర్లు నితీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు పాల్గొంటారు.

ఓటర్ జాబితా, స్లిప్పుల పంపిణీ, ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాల ముద్రణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, తదితరాలపై రాష్ట్ర అధికారులను కేంద్ర ఎన్నికల బృందం తీయనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశమై ప్రలోభాల కట్టడి, తనిఖీలు, స్వాధీనం చేసుకుంటున్న మొత్తం, చెక్ పోస్టులు, సమన్వయం తదితర అంశాలపై చర్చించనుంది. సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో సమావేశమై పరస్పర సమన్వయం, సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల తనిఖీలు, తదితర అంశాలపై చర్చించనుంది. ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో  మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరు భయపడవద్దని.. అందరికీ పోలీసు బలగాలు తోడుగా ఉంటాయని అధికారులు భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news