నేడు కల్వకుర్తి సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ

-

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా రెండో రోజైన నేడు ఆయన కల్వకుర్తిలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జడ్చర్ల కార్నర్ మీటింగ్​లో పాల్గొంటారు. షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి షాద్‌నగర్‌ చౌరస్తా వరకు రాహుల్‌ పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత షాద్‌నగర్‌ కార్నర్‌ సభలో ప్రసంగించనున్నారు.

ఇక మంగళవారం అసలు ప్రియాంకా గాంధీ రాష్ట్రానికి రానుండగా.. అనారోగ్య కారణాలతో ఆమె రాలేకపోయారు. దీంతో షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చారు. కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజాభేరి సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజలతో తమకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ సంబంధమని అందుకే ముఖ్యమైన సమావేశాలున్నా కాదనుకుని కొల్లాపూర్ సభకు హాజరయ్యామని రాహుల్‌ తెలిపారు.

వచ్చే ఎన్నికలు ప్రజల తెలంగాణకు.. దొరల తెలంగాణకు మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పెద్ద మోసమని.. దాని ద్వారా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. అంతటి ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజ్ కూలిపోయే దశ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలు, దళితులు, ఆదివాసులకు భూములు పంచితే… కేసీఆర్‌ వాటిని లాక్కున్నారని ఆరోపించారు. ధరణితో కేవలం కేసీఆర్‌ కుటుంబం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే లాభం చేకూరిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news