రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

-

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రామోజీరావు అంతిమ సంస్కారాలకు చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.

రామోజీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, సుజనా చౌదరి, చింతమనేని ప్రభాకర్‌, పట్టాభి, మంత్రులు తుమ్మల, జూపల్లి, సీతక్క, బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి , పోచారం, నామా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నలమోతు భాస్కర్‌రావు పాల్గొన్నారు. వేం నరేందర్‌ రెడ్డి, వెనిగండ్ల రాము, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, వి.హనుమంతరావు, నామా నాగేశ్వరరావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news