BREAKING: జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం

-

జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేశారు. అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు, స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు.

Jagan unveils stupa destruction

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక అటు నేడు నీది, రేపు మాది…మరచిపోకు ఈ నిజం అంటూ తెలుగు తమ్ముళ్లకు వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల ఘటనలపై ఆ పార్టీ x వేదికగా స్పందించింది. ‘నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం’ అని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులను ఓ వీడియోగా మలిచి ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news