తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మందితో తొలి జాబితా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
త్వరలోనే టికెట్లను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ములుగు BRS ఎమ్మెల్యే టికెట్ నాగజ్యోతికి కేటాయించడంతో మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.