కాంగ్రెస్ ఇంఛార్జిల మార్పు చేసింది అధిష్టానం. చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల ఇంఛార్జి నుంచి తప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల ఇంఛార్జి నుంచి తప్పుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇంఛార్జిలుగా ఉన్న చోట ఓడిపోతే పరువు పోతుందని తప్పుకున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.
డిసెంబర్ నెలలోనే పార్లమెంట్ వారీగా నియోజక వర్గాల ఇంఛార్జిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ.. నియమించి మూడు నెలలు కాకముందే ఇంఛార్జిలను మార్చింది కాంగ్రెస్. డిసెంబర్ నెలలో రిలీజ్ చేసిన పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జిలలో రేవంత్ రెడ్డి చేవెళ్ల ,మహబూబ్ నగర్ స్థానాలకులకు ఇంఛార్జిగా ఉన్నారు.
సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిగా భట్టి విక్రమార్క ఉన్నారు. తాజాగా ప్రకటించిన లిస్టులో వారు ఆయా స్థానాల నుంచి తప్పుకున్నారు. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారిని కాదని అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అయిన రేవూరి ప్రకాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులకు వరంగల్, మల్కాజ్ గిరి ఇంఛార్జిగా నియమించింది టీపీసీసీ.