శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో పార్కింగ్‌ ప్రాంతం నుంచే చెక్‌-ఇన్‌ సౌకర్యం

-

ఎయిర్‌ పోర్ట్‌ వెళ్లే వారికి శుభవార్త. విమాన ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో…. బ్యాగేజ్ చెక్ ఇన్, సెక్యూరిటీలో అంత ఇబ్బందిగా ఉంటుంది. ఫ్లైట్ జర్నీ సమయానికి ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ కి చేరుకోవడంతో భారీ క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Check-in facility at Shamshabad Airport from the parking area

కారు పార్కింగ్ లోనే ‘సిటీ సైడ్ సెల్ఫ్ చెక్ ఇన్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు కారు పార్కింగ్ లోనే బ్యాగేజ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. అక్కడే బ్యాగేజీ తనిఖీలతో పాటు, బోర్డింగ్ పాసులను సైతం తీసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో లగేజ్ తో ప్రయాణం చేసే వారికి సమయం ఆదా అవుతుంది. ఫ్లైట్ బయలుదేరే ఆరు గంటల ముందు నుంచి ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. కొత్త ఏడాది తొలి రోజు నుంచి ఈ సేవలను అమల్లోకి తీసుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news