దేశంలో మధ్య తరగతి, పేద కుటుంబాలకు ధరల పెరుగుదల కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే వంట నూనెలు, పెట్రోల్, గ్యాస్ ఇలా చెప్పుకుంటే అన్ని నిత్య వసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక తాజాగా బాయిలర్ కోడి ధరలు కూడా కొండెక్కాయి. దీంతో చికెన్ రేట్లు ఆకాశానికి అంటాయి.
గత నెలతో పోల్చితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసంలో.. చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చికెన్ కిలో రూ.280 వరకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.300 క్రాస్ అయింది. దాదాపు 4 నెలలుగా కోడిగుడ్లు ధరలు నిలకడగా ఉండగా.. చికెన్ రేటు కిలో రూ.140-180 మధ్యే ఉంది.
కానీ రెండు నెలల కిత్రం బాయిలర్ కోళ్ల ఫామ్ గేట్ రేటు కిలో రూ.100 లోపే ఉంది. అయితే 10 రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో.. చికెన్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.