సామాన్యుడికి షాక్… రెండు నెలల్లో రూ. 40 పెరిగిన పామాయిల్ ధరలు

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మన వంటింట్లో మంటలు రేపుతున్నాయి. యుద్ధ పరిణామాల వల్ల వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇండియాకు 80 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యాల నుంచే వస్తుంది. అలాంటిది ఇప్పుడు యుద్ధం వల్ల సప్లై చైన్ ఆగిపోయింది. దీనికి తోడు రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కూడా ఈ పరిస్థితికి కారణం అవుతున్నాయి.

ఈ కారణంగా పామాయిల్ కు డిమాండ్ పెరిగింది. గత రెండు నెలల క్రితం విజయ బ్రాండ్ పామాయిల్ లీటర్ ధర రూ. 126 ఉండగా… ప్రస్తుతం లీటర్ రేట్ రూ. 165కు చేరింది. రెండు నెలల వ్యవధిలో రూ. 40 పెరిగింది. ఇండియా పామాయిల్ కోసం ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా దేశాలపైనే ఆధారపడి ఉంది. అక్కడ నుంచే ఏటా కొన్ని లక్షల కోట్ల విలువైన పామాయిల్ ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాలో పెరుగుతున్న పామాయిల్ రేట్లను అదుపు చేసేందుకు ఎగుమతులపై ఇటీవల కొన్ని ఆంక్షలు విధించింది. ఈ పరిణామంతో అనుకన్నంతగా పామాయిల్ దిగుమతి కావడం లేదని తెలుస్తోంది. మరోవైపు సన్ ఫ్లవర్ కూడా అందుబాటులో లేకపోవడంతో నూనెల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news