అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగింది..తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అంటూ అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అమెరికాకు మీరే ఆయువుపట్టు అని… ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అంటూ పేర్కిన్నారు. అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండని రేవంత్ రెడ్డి కోరారు. న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…అమెరికాకు మీరే ఆయువుపట్టు అన్నారు. తెలంగాణ మీ జన్మభూమి అని కొనియాడారు. మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుందన్నారు. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందని న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది.