1995 కాలపు చంద్రబాబును చూస్తారు – సీఎం చంద్రబాబు వార్నింగ్‌

-

1995 కాలపు చంద్రబాబును చూస్తారని కలెక్టర్లను సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. 1995 సీఎంని చూస్తారని తెలిపారు. అంగన్వాడీలకు పోతా.. డ్రైన్లను పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు.

Chandrababu on p collectors

డ్రైన్లల్లోకి ఐఏఎస్సులను కూడా దింపాననన్నారు. డ్రైన్ల పరిస్థితి చూడండి అని అధికారులను పంపానని తెలిపారు. పని చేసే బాధ్యత అధికారులది.. పని చేయించే బాధ్యత మాదన్నారు సీఎం చంద్రబాబు. దీన్ని అధికారులందరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు.. ఐఏఎస్సులుగా ఉన్న వాళ్లకి కలెక్టర్లుగా చేయడం ఓ కల అని… పని చేయకుంటే గ్యారెంటీ లేదన్నారు. ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చాలా చక్కటి అవకాశం అని తెలిపారు. బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు.విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news