ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముందుగా ఇవాళ ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్.
అనంతరం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారమచంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు మధ్యాహ్నం భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించనున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్….సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.