సీఎం రేవంత్ సార్…మా ఇల్లు మాకు కావాలి !

-

సీఎం రేవంత్ సార్…మా ఇల్లు మాకు కావాలంటూ ఓ చిన్నారి మీడియాతో పేర్కొన్న వీడియో వైరల్‌ గా మారింది. హైదర్శకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇండ్లు కూల్చొద్దు అంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు చిన్నారులు. మేము రోడ్డున పడతాం.. హైడ్రా ప్లీజ్ మా ఇండ్లు కూల్చొద్దంటూ ఈ సందర్భంగా చిన్నారులు అందరూ డిమాండ్‌ చేస్తున్నారు.

Children protesting with placards saying ‘Don’t demolish our houses’ in Musi catchment areas of Hydera

మా పేరెంట్స్ గురించి బాధ అయితుందంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. నెల నుండి నిద్ర లేదు, తిండి లేదు.. మేము రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళిపోతామని ఈ సందర్భంగా బాధితులు కూడా అంటున్నారు. బఫర్ జోన్లో ఉంటే బ్యాంక్లో లోన్ ఎందుకు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, టాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారని ప్రశ్నించారు.

మాకు ముందు తెలియదు కదా, 60 లక్షల లోన్ తీసుకొని కట్టినం.. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలని.. ప్రజలను ఇబ్బంది పెట్టి మూసి సుందరీకరణ చేసి ఎం చేస్తాడు.. ముందు ప్రజలను సంతోష పడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. మాకు డబల్ బెడ్ రూమ్ వద్దు ఎం వద్దు.. మా ఇండ్లు మాకు కావాలంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news