ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5 విడుతల్లో ఎన్నికలు జరిగాయి. మే 25న ఆరో విడత, జూన్ 01న ఏడో విడతతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోతాయి. జూన్ 04న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
దీంతో ఈవీఎంలు జూన్ 04 వరకు భద్రపరచనున్నారు. అయితే ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇవాళ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత భేషుగ్గా ఉందని తెలిపారు. మూడంచెల విధానాన్ని అమలు చేశారు. ఈవీఎంల వద్ద భద్రత సరిగ్గా లేదనే రూమర్స్ ఎవ్వరూ నమ్మకూడదన్నారు. కేంద్ర బలగాల స్ట్రాంగ్ రూమ్ వద్ద మొహరించాయని తెలిపారు.