రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో అమ్ముతున్న బ్లడ్ బ్యాంక్ లు మూసివేత

-

హైదరాబాద్ నగరంలో బ్లాక్ లో అమ్ముతున్న బ్లడ్ బ్యాంకులకు తాజాగా అధికారులు షాక్ ఇచ్చారు. బ్లాక్ దందాకి చెక్ పెట్టారు. రోజు రోజుకు నగరంలో బ్లాక్ దందా పెరిగిపోతుందని గుర్తించి.. వారికి చెక్ పెట్టారు. ముఖ్యంగా మనుషుల రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో అమ్ముతున్న బ్లడ్  బ్యాంక్ లు మూసివేశారు. మియాపూర్ లోని శ్రీకర బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫా లోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేశారు.

రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ లో రద్దు చేశారు  డ్రగ్ కంట్రోల్ అధికారులు. అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ లో అమ్ముతున్న ముఠా ను పట్టుకున్నారు అధికారులు. ముసాపేట లోని హీమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కేంద్రంగా ప్లాస్మా నిల్వ చేస్తున్న ముఠాను, ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను విచారించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హీమో ల్యాబ్ నుంచి బ్లాక్ లో ప్లాస్మా, రక్తం కొంటున్నాయి శ్రీకర బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ లు.

Read more RELATED
Recommended to you

Latest news