నేడు టీహబ్‌-2ను ప్రారంభించనున్న కేసీఆర్..ట్రెండింగ్ అవుతోన్న హైదరాబాద్

-

దేశం లోనే ప్రతిష్టాత్మక స్టార్ట్ అప్ ఇంక్యు బేటర్ టీ- హబ్ 2 ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. ఒకేసారి నాలుగు వేలకు పైగా స్టార్టప్ వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంతం ఇది. హైదరాబాద్ రాయదుర్గం లోని నాలెడ్జి సిటీలో దీనిని 400 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.

దీనిని ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

టీ- హబ్ 2ను యాభై మూడు మీటర్ల ఎత్తులో… దాదాపు మూడు ఎకరాల లో నిర్మించారు. ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జే ఎస్ రంజన్, టీ- హబ్ సీఈఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అప్ ఇంక్యుబేటర్ టీ- హబ్ 2 తో ఇప్పటికే చాలా కంపెనీలు డీల్‌ కుదుర్చుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version