ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం అయింది. వాహక నౌక నుంచి విడిపోయింది ఉపగ్రహం. ఆదిత్య L-1ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది PSLV C-57 రాకెట్. దీంతో షార్‌లో శాస్త్రవేత్తల సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 4 నెలల పాటు ప్రయాణించి ఎల్-1 పాయింట్‌కు చేరుకోనుంది శాటిలైట్.
ఈ తరుణంలోనే.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈరోజు ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.