నేడు కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

-

తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట కరీంనగర్​కు చేరుకోనున్న కేసీఆర్.. ఎస్​ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం గంగాధరకు వెళ్లి అక్కడి సభలో ప్రసంగిస్తారు. ఇక చివరగా జమ్మికుంటకు చేరుకుని అక్కడ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.

ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు తీవ్రంగా కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధమని.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు బీజేపీపైనా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఆ పార్టీకి ఉన్న మతపిచ్చిని చిత్తుచిత్తుగా చేసి చెత్తకుప్పలో పడేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news