నేడు మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

-

నేడు మధ్యప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 230 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. వివిధ పార్టీల తరఫున ఈ రాష్ట్రంలో 2,534 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 252 మహిళా అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ల మధ్యే కనిపిస్తోంది. మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. ఈసారి పూర్తి మెజార్టీతో మధ్యప్రదేశ్​లో జెండా పాతాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 5,60,60,925 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,88,25 607 మంది, మహిళలు 2,72,33,945 మంది, ఒకవెయ్యి 3 వందల 73మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,626 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అయి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ పోలింగ్ అనంతరం.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news