మార్చి 31 లోపు వరికోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి – సీఎం కేసీఆర్‌

-

మార్చి 31 లోపు వరికోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోండని ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌.పర్యావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండాలంటే పంటకాలంలో మార్పు లు రావాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గారి అధ్యక్షతన జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీ ఛైర్మన్‌లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్‌లు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..మంత్రులకు క్లాస్ పీకారు. మంత్రులు…ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలుపుకొని వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు వాళ్లతో సమావేశాలు నిర్వహించడం లేదని.. వారం లోపల అందర్నీ పిలిచి సమావేశాలు పెట్టండని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. ఎమ్మెల్యే లు అందరినీ కలుపు కుని పొండి.. జూన్ రెండు నుంచి జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ లను ,ఎంపిలను ,జెడ్పీ చైర్మన్ లు పిలవండని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news