ఖాళీ స్థలం ఉన్నవారికి రూ. 3 లక్షలు.. 15 రోజుల్లోనే విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఖాళీ స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దీనికోసం 15 రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని అర్హులను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తారని వివరించారు. ఈ స్కీం కింద పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1000 ఇల్లు అధికంగా మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టింది కాదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే. సంస్కరణ అనేది అంతం కాదన్నారు సీఎం కేసీఆర్‌. పాలమూరులో కొత్త కలెక్టరేట్‌ భవనం ప్రారంభించుకోవడం సంతోష మన్నారు. వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు సంతోషంగా ఉంది. ఏ తెలం గాణ కోసం పోరాడామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనమే భేష్‌ అ ని కొనియాడారు సీఎం కేసీఆర్‌.