ఉత్తర ప్రదేశ్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర ప్రభుత్వం పై తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ను దించాలనే ముఖ్య ఉద్దేశంతో.. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను నిరంతరం కలుస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రిందట బీహార్ కు వెళ్లిన సీఎం కేసీఆర్… జాతీయ మీడియాలోనే హైలెట్ గా నిలిచారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

బిజెపి ఇలాక అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అయినా సమాజ్వాది పార్టీతో సీఎం కేసీఆర్ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభలో మోడీ సర్కార్ వైఫల్యాలను… ప్రతిబింబించేలా సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనుంది. అంతేకాదు ఈ బహిరంగ సభకు కేజ్రీవాల్ , మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి సీఎంలను రప్పించనున్నారు సీఎం కేసీఆర్. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news