ధరణి తీసేస్తే మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది: కేసీఆర్‌

-

పోడుభూముల పట్టాల పంపిణీకి కేంద్రం అడ్డంకిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్‌ ఇవ్వడం వృథా అని రేవంత్‌రెడ్డి అంటున్నారని.. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ సరిపోతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. భూ వివాదాలు ఉండకూడదని ధరణి పోర్టల్‌ తీసుకొచ్చామని తెలిపారు. కాగజ్​నగర్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు.

“కాంగ్రెస్‌ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తాయి? ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయి. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చలు జరపండి. పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూ లేదు. కాంగ్రెస్‌ హయాంలో మైనారిటీలకు రూ.900 కోట్లు కేటాయించారు. భారాస హయాంలో మైనారిటీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాం.” అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version