యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అనిల్‌కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందని.. ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులపైకి మార్చగలరని అన్నారు. ధరణిని తీసేస్తే రైతు బంధు నిధులు ఎలా జమ అవ్వాలి? అని కేసీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో భూములు విలువ భారీగా పెరిగాయని.. రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని.. దీనిని తీస్తే రైతుబంధు నిధులు ఎలా జమ అవ్వాలని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. 3 గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.