ఆ ఒక్క బిల్డింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తుంది : సీఎం కేసీఆర్

-

తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది.. కాంగ్రెస్సేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొన్ని రోజుల్లోనే టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీలో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. నిరుపేదలకు అనేక కార్యక్రమాలు చేశామని.. రెండేళ్లలో టెక్స్‌టైల్‌ పార్క్‌లో మహిళలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. రెండో అతిపెద్ద నగరంగా వరంగల్​ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్​లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

“24 అంతస్తుల కొత్త ఎంజీఎం భవనం… హైదరాబాద్‌లో కూడా లేదు. ఈ ఒక్క భవనం చాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడానికి. ఆటో రిక్షాల కార్మికులకు… ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పర్మిట్ టాక్స్‌ను రద్దు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్‌లో నిర్వహించాం. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు జరుగున్నది 95వ సభ. తెలంగాణ ఉద్యమలో కీలక ఘట్టాలకు వరంగల్‌ వేదికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే బీఆర్ఎస్ పుట్టింది. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, గత 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేసుకోవాలి.” అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news