తెలంగాణాలో బీజేపి సర్కార్ వస్తుంది అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ పేర్కొన్నారు. దేవరకొండలో తెలంగాణలో అవినీతి పాలన నడుస్తుంది. బీఆర్ఎస్ కాదు.. ఎఫ్ఆర్ఎస్ (ఫ్యామిలీ రాష్ట్ర సమితి) తెలంగాణాలో కేసిఆర్ కుటుంభానికి తప్ప, ఎవరికి ఉద్యోగాలు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని.. ఇక్కడి ఎమ్మెల్యే SLBC, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి చేయలేక పోయాడు.ఇక్కడి ఎమ్మెల్యే వందల ఎకరాల భూములు సంపాదించాడు అదంత ఇక్కడి ప్రజల డబ్బు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో అతనికే తెలియదు. మొన్న ఒక పార్టీ, నేడు ఒక పార్టీ, రేపు మరీ ఏ పార్టీనో.. అందుకే
బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తుంది అని తెలిపారు ఫడ్నవిస్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకోకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు పోయాయి.