నేడు ఢిల్లీలో అఖిలేష్ యాదవ్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్

-

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే కెసిఆర్ నేడు యూపీ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం కానున్నారు. ఢిల్లీలోనే ఇరువురు నేతల మధ్య భేటీ జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ పార్టీల ఐక్యవేదికపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న గులాబీ బాస్.. ఈనెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. కెసిఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ పార్టీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు.ఇక సీఎం కేసీఆర్ మే 22న చండీఘర్ లో పర్యటించనున్నారని.. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన పంజాబ్, హర్యానా,ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news