CM KCR : ఇవాళ మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

-

CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… పూర్తిగా ఎన్నికల పైన దృష్టి పెట్టారు. ప్రతిరోజు మూడు బహిరంగ సభలో పాల్గొంటూ… ముందుకు సాగుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. నిన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రచారం చేసిన సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాకు వెళ్లారు.

CM KCR will participate in three public meetings today
CM KCR will participate in three public meetings today

ఉమ్మడి నల్గొండ జిల్లాలలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ముందుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు హాజరుకానున్నారు. ఈ తరుణంలో మూడు నియోజకవర్గాలలో సభా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రమావత్ రవీంద్ర కుమార్, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని సభలలో 70 నుంచి లక్ష మంది వరకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news