మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా – సీఎం కేసీఆర్

-

మునుగోడుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు సీఎం కేసీఆర్. చండూరులో టిఆర్ఎస్ రణభేరి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని ప్లాన్ చేసిన వారిని అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ బ్రోకర్ గాళ్లు  తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామనుకున్నారని.. కానీ తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని అన్నారు.

రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా నరేంద్ర మోడీ ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా అన్నారు. ఈ కుట్ర వెనకాల ఉన్న వారు ఒక్క క్షణం కూడా పదవులలో ఉండడానికి వీల్లేదన్నారు సీఎం కేసీఆర్. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా చరిత్రలో ఓ సువర్ణ అవకాశం ఈ ప్రజలకు దక్కిందని అన్నారు. భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాదిరాయి వేసే అవకాశం మునుగోడు ప్రజలకు దక్కిందన్నారు.

ఆనాడు తెలంగాణ కోసం సిద్దిపేట నుంచి బయలుదేరినప్పుడు .. సిద్దిపేట ఉప ఎన్నికలలో సిద్దిపేట ప్రజలు తనకి 65 వేల ఓట్ల మెజారిటీని ఇచ్చారని.. ఇప్పుడు జాతీయ రాజకీయాలలోకి వెళ్లే కెసిఆర్ కి ప్రభాకర్ రెడ్డి రూపంలో భారీ మెజారిటీని ఇచ్చి గెలిపించాలన్నారు. జాతీయ రాజకీయాలలో కెసిఆర్ ఎంత ఎత్తుకు ఎదిగినా.. దానికి పునాది మునుగోడే కాబోతుంది కాబట్టి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version