సీతక్కను ఓడించేందుకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియమించారు.
తనను ఇన్‌చార్జిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు పోచంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఎన్నికల్లో ములుగు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ములుగును జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పోచంపల్లి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించడం ద్వారా ఆయన రుణాన్ని తీర్చుకుంటామని దిమ వ్యక్తం చేశారు. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం మరికొన్ని గంటల్లో రాబోతోంది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ మధ్యాహ్నం విడుదల కానుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు.