వివాదంలో రేవంత్ పీఏ, మంత్రి పొన్నం ప్రభాకర్ చిక్కుకున్నారు. తెలంగాణ రవాణా శాఖలో అక్రమ వసూళ్లు జరగుతున్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ పీఏ జైపాల్ రెడ్డి, మంత్రి పొన్నం ఇద్దరూ కలిసి…వసూళ్లు చేస్తున్నారని ఈ వార్తల సారాంశం. 13 రవాణా చెక్ పోస్టుల నుంచి రోజుకు రూ.1.20 కోట్ల మామూళ్ల వసూళ్ళు చోటు చేసుకున్నాయని అంటున్నారు.
జైపాల్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ లంచం సొమ్మును పంచుకుంటున్నట్లు ఆరోపణలు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. రవాణా శాఖలో మహిళా కానిస్టేబుల్‌గా ఉన్న అన్నపూర్ణకి నిబంధనలకు విరుద్ధంగా MVIగా పదోన్నతి కల్పించారట సీఎం పీఏ జైపాల్ రెడ్డి. 2016 బ్యాచ్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్‌కు AMVIలుగా పదోన్నతి ఇప్పించడానికి ఒక్కొక్కరి దగ్గర నుండి పొన్నం ప్రభాకర్, సీఎం పీఏ జైపాల్ రెడ్డి రూ. కోటి అడ్వాన్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. ఇక పొన్నం, సీఎం పీఏ అవినీతిపై ఢిల్లీ హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారట. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.