బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ హైఅలర్ట్

-

బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోటా విషయంలో చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసకు దారి తీసి 300 మంది ప్రాణాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న ఉన్నతాధికారులు ప్రస్తుతం బంగ్లాలో పరిస్థితిని మోదీకి వివరించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేఘాలయాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగం లోపల 200 మీటర్ల వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల అమలు చేస్తామని మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టైన్‌సాంగ్ తెలిపారు. మరోవైపు మేఘాలయ మాత్రమే కాకుండా, బంగాల్, అసోం సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news