‘పద్మ’ పురస్కార గ్రహీతలకు సీఎం రేవంత్ సన్మానం

-

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 5 మందికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు (మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి) ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం 34 మందికి ప్రకటించగా తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులు, ఏపీకి చెందిన ఒకరిని ఈ పురస్కారం వరించింది.

తెలంగాణ నుంచి చిందు యక్షగానంలో గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప, గ్రంథాలయ ఉద్యమకారుడు కూరెళ్ల విఠలాచార్య, స్థపతి వేలు ఆనందాచారి, భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన కేతావత్‌ సోమ్లాల్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఏపీకి చెందిన హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్​ మాదాపూర్ శిల్ప‌క‌ళావేదికలో యంగ్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం, క‌ల్చ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు స‌న్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి పద్మ విభూషణ్ గ్రహీతలపైన వెంకయ్యనాయుడు, చిరంజీవిలతో పాటు తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలను సన్మానించారు.

Read more RELATED
Recommended to you

Latest news