నేడు హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన

-

నేడు హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలివేటెడ్‌ కారిడార్‌, మెట్రోరైలు విస్తరణ పనులకు ఇవాళ భూమిపూజ చేయనున్నారు. నగరంలోని సికింద్రాబాద్ ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి ఈ కారిడార్‌ మొద‌లు కానుంది. తాడ్‌బండ్ జంక్షన్‌, బోయిన‌ప‌ల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్‌ వ‌ద్ద ముగుస్తుంది. రూ.1,580కోట్లతో 5.32 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌ నిర్మాణం జరుగుతోంది. 4.65 కి.మీ.ఎలివేటెడ్ కారిడార్, 0.6 కి.మీ. అండ‌ర్‌ గ్రౌండ్ ట‌న్నెల్ నిర్మించనున్నారు. 131 స్తంభాలతో 6 వ‌రుస‌ల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుండగా.. బోయిన‌ప‌ల్లి జంక్షన్ స‌మీపంలో ఇరువైపులా ర్యాంపుల నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఈరోజే ఎల్బీనగర్ వద్ద బైరామల్‌గూడ కూడలిలో పైవంతెన ప్రారంభం కానుంది. రెండో స్థాయి పైవంతెనను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.148.5 కోట్లతో బైరామల్‌గూడ కూడలి వద్ద పైవంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బీఎన్‌రెడ్డినగర్, సాగర్ వైపు వెళ్లే వాహనాలకు ఉపయోగపడనుంది. చింతలకుంట చెక్‌పోస్టు అండర్ పాస్ నుంచి హయత్‌నగర్ వెళ్లే వాహనదారులకు కూడా దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news