నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్

-

నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం జీరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే టైపు కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందని వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు.

“కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యింది. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. ఈ ప్రభుత్వం 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే గ్రూప్‌- 1 నోటిఫికేషన్‌ ఇస్తాం. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి గ్రూప్‌- 1 నిర్వహిస్తాం. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నాం. సీఎంవోలో మైనార్టీ ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించాం. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారు” అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news