పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

-

తెలంగాణలో ఉన్న పెండింగ్ నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాల జారీ చేశారు. శనివారం రోజున సచివాలయంలో నీటిపారుదల శాఖపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు.

 

ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు గ్రామాలు, మండలాల వారీగా సిద్ధం చేయాలని రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని వెల్లడించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కొన్ని ప్రాజెక్టులను  గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news