శిల్పారామం నైట్‌బజార్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్‌లో శిల్పారామంలోని నైట్‌ బజార్‌ను పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నైట్‌ బజార్‌లో ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

2017 నుంచి నిరుపయోగంగా ఉన్న 119 స్టాళ్లను ఇందుకోసం సిద్ధం చేయాలని రేవంత్ సూచించారు. మహిళలకు మాత్రమే వీటిని కేటాయించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే మణిపుర్‌లో మహిళలకు కేటాయించిన మార్కెట్‌ను అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం చేశారు.

మరోవైపు సీఎం రేవంత్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో అటవీ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎల్బీ స్టేడియం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news