టీచర్లను తేనేటీగలతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి..!

-

టీచర్లు తేనె టీగలలాంటి వాళ్లు.. వాళ్లు ఎవ్వరి జోలికి వెళ్లరు.. వాళ్ల జోలికి ఎవరైనా వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎల్బీస్టేడియంలో ప్రమోషన్లు, బదిలీలు అయిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ముఖా ముఖీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు వినేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దమే అని అన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 24 వేల మంది పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో టీచర్లకు చాలా గౌరవం ఉండేదని గుర్తుచేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. గుంటూరు, పూణెలో చదివానని ఒకాయన అసెంబ్లీలో చెప్పారు. కానీ నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ టీచర్లు చదువు చెబితేనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news