నెలకొక సారి అయినా ఉన్నత ఉద్యోగం లో ఉన్నవాళ్లు స్వంత ఊర్లకు వెళ్ళండి. వెనుకబడ్డ వారి సమస్యలు అడిగి తెలుసుకోండి, స్ఫూర్తి కలిగించండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లీడర్ అంటే లీడ్ చేసే వాడు. కానీ గృహ ప్రవేశాలు అంటూ దావత్ లు చేసుకుంటున్నామని బయటకు చెప్తున్నారు. దీపావళి కి అందరూ చుచ్చుబుడ్డి లు వెలిగిస్తే.. కొంతమంది సారా బుడ్డి లు ఓపెన్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకునే నిబంధనలు అతిక్రమిస్తుంటే.. వాళ్ళనీ ప్రోత్సహిస్తున్నా.. వీళ్ళని ఏమనాలి. సమాజం మనది, మన పిల్లలు వ్యసనాలకు అలవాటు పడితే ఎంత డబ్బు ఉన్న ఉపయోగం లేదు.
ఇక పోలీస్, రవాణా శాఖ వాళ్ళకి సూచిస్తున్న. నిన్న ఒక పెద్దయన చాలాకాలం తర్వాత బయటకి వచ్చి, జనం నష్ట పోయారు అంటాడు. నష్ట పోయింది మీ 4 నలుగురు. మీ ఉద్యోగం పోయింది అది మాత్రమే నష్టం. కానీ కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం వినియోగించుకుని మహిళలు బస్సులు ఎక్కుతున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షలు వినియోగించుకుంటూ వైద్యం చేసుకుంటున్నారు. 500 రూపాయలకు గ్యాస్ అందిస్తున్నాం అని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం.