తెలంగాణకు నూతన గవర్నర్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తొలిసారిగా ఇవాళ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశం నుంచి గవర్నర్ కి స్వాగతం పలికేందుకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ కు చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్ శర్మకు పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి.
అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. రాజభవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 5 గంటల ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఆరాధే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష నాయకులు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, తదితరులు హాజరు కానున్నారు.